India vs Bangladesh World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్ కప్‌లో మరో ఫైట్‌కు భారత్ రెడీ అయింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ టాప్ ప్లేస్‌కు రావాలని చూస్తుండగా.. రెండు వరుస ఓటమలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌ మళ్లీ గెలుపు రుచి చూడాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ షకీబుల్ హాసన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో నజ్మూల్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. టీమిండియా ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. బంగ్లా రెండు మార్పులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“నాకు, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. మేము ఈ రోజు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. తాజా వికెట్‌గా కనిపిస్తోంది. మంచి స్కోరు సాధిస్తే జట్టుకు మేలు జరుగుతుంది. షకీబ్ కొంచెం  ఇబ్బంది పడుతున్నాడు. షకీబ్ స్థానంలో నాసుమ్ జట్టులోకి వచ్చాడు. భారత్‌తో మాకు గొప్ప గుర్తులు ఉన్నాయి. మేము మా ఫామ్‌ను కొనసాగిస్తాము. ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు రెండు జట్లకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం. హసన్ స్థానంలో టాస్కిన్ తుది జట్టులోకి వచ్చాడు..” అని బంగల్ఆ కెప్టెన్ నజ్మూల్ శాంటో తెలిపాడు.


“మేము టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్ చేసి వాళ్లం. టీమ్‌ను మార్చడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరినీ కరెక్ట్‌ ప్లేస్‌లో ఆడించడం ముఖ్యం. మా ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మేము ఈ జోరును కొనసాగించాలనుకుంటున్నాము.” కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 


తుది జట్లు ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.